ఫైనల్‌ దారిలో.. ఆశల పల్లకిలో!

ప్రధానాంశాలు

ఫైనల్‌ దారిలో.. ఆశల పల్లకిలో!

టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులకు అత్యంత కీలకమైన రెండు పోరాటాలకు సమయం ఆసన్నమైంది. బాక్సింగ్‌ 69 కేజీల విభాగంలో ఇప్పటికే క్వార్టర్స్‌ దాటి పతకం ఖాయం చేసిన లవ్లీనా.. బుధవారం సెమీఫైనల్లో ప్రపంచ ఛాంపియన్‌ బుసానెజ్‌ (టర్కీ)ను ఢీకొనబోతోంది. ఈ బౌట్‌లో గెలిస్తే లవ్లీనాకు స్వర్ణం సాధించే అవకాశం లభిస్తుంది. సెమీస్‌లో ఓడితే కాంస్యంతో సంతృప్తి చెందాల్సి ఉంటుంది. ఇక మూడుసార్లు ఒలింపిక్‌ ఛాంపియన్‌ అయిన ఆస్ట్రేలియాకు క్వార్టర్స్‌లో షాకిచ్చి సంచలనం సృష్టించిన మహిళల హాకీ జట్టు సైతం సెమీస్‌లో అర్జెంటీనాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌ గెలిస్తే స్వర్ణ పోరుకు అర్హత సాధిస్తుంది. ఓడితే కాంస్యం కోసం మరో మ్యాచ్‌ ఆడాల్సి ఉంటుంది. టోక్యోలో ఇప్పటిదాకా చేసిన ప్రదర్శనే స్ఫూర్తిగా లవ్లీనా, హాకీ అమ్మాయిలు ముందంజ వేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక మంగళవారం భారత్‌కన్నీ ప్రతికూల ఫలితాలే వచ్చాయి. పురుషుల హాకీ జట్టు సెమీస్‌లో పరాజయం పాలవగా.. రెజ్లింగ్‌లో సోనమ్‌ మలిక్‌, జావెలిన్‌ త్రోలో అన్ను రాణి, షాట్‌పుట్‌లో తజిందర్‌లకూ ఓటములు ఎదురయ్యాయి.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని