నేడు వాసాలమర్రికి సీఎం కేసీఆర్‌

ప్రధానాంశాలు

నేడు వాసాలమర్రికి సీఎం కేసీఆర్‌

దళితవాడలో పర్యటన, రైతువేదికలో ప్రజలతో ముఖాముఖి

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదాద్రి భువనగిరి జిల్లాలోని దత్తత గ్రామమైన వాసాలమర్రిలో బుధవారం పర్యటించనున్నారు. దళితవాడలో పర్యటనతో పాటు రైతువేదికలో 130 మందితో సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మంగళవారం స్వయంగా అధికార యంత్రాంగానికి, గ్రామసర్పంచి ఆంజనేయులుకు ఫోన్‌చేసి చెప్పారు. గతంలో తానిచ్చిన హామీల అమలును ఆయన సమీక్షిస్తారు. జూన్‌ 22న ఈ గ్రామంలో పర్యటించిన కేసీఆర్‌.. గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేసి, వారితో సమావేశమయ్యారు. గ్రామాభివృద్ధిపై వారికి దిశానిర్దేశం చేశారు. సత్వర కార్యాచరణ కోసం అధికారులకు ఆదేశాలిచ్చారు. బుధవారం మరోసారి అక్కడికి వెళ్తున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని