రాష్ట్రంలో 623 కొవిడ్‌ కేసులు

ప్రధానాంశాలు

రాష్ట్రంలో 623 కొవిడ్‌ కేసులు

మరో ముగ్గురి మృతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 623 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 6,47,229కి పెరిగింది. మహమ్మారితో మరో ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకూ 3,814 మంది కన్నుమూశారు. తాజాగా 594 మంది కరోనాకు చికిత్స పొంది కోలుకోగా.. మొత్తం 6,34,612 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఈ నెల 4న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు బుధవారం విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 8,803 క్రియాశీల కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం 1,12,796 నమూనాలను పరీక్షించారు. మరో 1,696 నమూనాల ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీలో 77 కొత్త కేసులు నమోదవగా.. కరీంనగర్‌ జిల్లాలో 65, వరంగల్‌ నగర జిల్లాలో 59, ఖమ్మంలో 52, నల్గొండలో 41, పెద్దపల్లిలో 41, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 33 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 30 కంటే తక్కువ సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో 1,19,404 కొవిడ్‌ టీకా డోసులు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 1,13,81,699 మంది తొలి డోసు, 36,41,798 మంది రెండో డోసు స్వీకరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని