పదిమంది రండి.. మాట్లాడుకుందాం

ప్రధానాంశాలు

పదిమంది రండి.. మాట్లాడుకుందాం

కాశిరెడ్డిపల్లి గ్రామస్థులకు సీఎం కేసీఆర్‌ ఆహ్వానం

సమస్యల పరిష్కారానికి హామీ

న్యూస్‌టుడే, ములుగు: గ్రామంలో ఎన్ని సమస్యలున్నా సరే.. మాట్లాడుకుని పరిష్కరించుకుందామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాశిరెడ్డిపల్లి గ్రామస్థులకు హామీ ఇచ్చారు. బుధవారం వాసాలమర్రిలో పర్యటన ముగించుకొని ఎర్రవల్లికి వెళుతున్న క్రమంలో సాయంత్రం 5.50 గంటల ప్రాంతంలో సీఎం వాహనశ్రేణి కాశిరెడ్డిపల్లికి చేరుకుంది. అప్పటికే సర్పంచి స్వరూప, కొందరు నాయకులు గ్రామస్థులు రహదారికి ఇరువైపులా వేచి చూస్తున్నారు. గమనించిన సీఎం కేసీఆర్‌ వాహన శ్రేణిని నిలిపి కిందకు దిగి గ్రామాభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ మల్లేశ్‌ తదితరులను చెంతకు రమ్మని పిలిచారు. వారు గ్రామ సమస్యలతో రూపొందించిన వినతిపత్రాన్ని ఇచ్చారు. దాన్ని చదివి ‘ఇప్పుడు సమయం లేదు. 10వ తేదీ తర్వాత పిలుస్తా. గ్రామంలో నుంచి ముఖ్యమైన 10 మంది వ్యవసాయ క్షేత్రానికి రండి. అక్కడ అంతా కలసి భోజనం చేస్తూ ఊరి సమస్యలపై మాట్లాడుకుందాం. అన్నింటినీ పరిష్కరించేందుకు నేనున్నా.. మీరంతా నిశ్చింతగా ఉండాలి’ అని భరోసా ఇచ్చి తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. సీఎం హామీతో కాశిరెడ్డిపల్లె వాసులు సంతోషంలో మునిగి పోయారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని