జేఈఈ మెయిన్‌ తుది కీ విడుదల

ప్రధానాంశాలు

జేఈఈ మెయిన్‌ తుది కీ విడుదల

ముగ్గురు తెలుగు విద్యార్థులకు 100 పర్సంటైల్‌!

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ మూడో విడత తుది కీని జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) గురువారం రాత్రి ఖరారు చేసింది. దేశవ్యాప్తంగా జులై 20, 22, 25, 27 తేదీల్లో పేపర్‌-1, 2 పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 7.09 లక్షల మంది దరఖాస్తు చేయగా దాదాపు 6.50 లక్షల మంది పరీక్షలు రాశారు. వారికి పర్సంటైల్‌ స్కోర్‌ ఇవ్వనున్నారు. చివరి విడత పరీక్షలు ఈ నెల 26వ తేదీ నుంచి మొదలుకానున్నాయి. అవి ముగిసిన తర్వాత ర్యాంకులు ఇస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురికి 300 మార్కులకు 300 వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అంటే వారికి 100 పర్సంటైల్‌ స్కోర్‌ వచ్చినట్లే. వర్షాల కారణంగా మూడో విడతలో మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో పరీక్షలు వాయిదా పడగా వాటిని ఈ నెల 3, 4 తేదీల్లో జరిపారు. ఇప్పుడు వాటిని కలుపుకొని పర్సంటైల్‌ ఇస్తారా? లేదా? అన్నది వేచిచూడాలి. వాటిని కలిపితే పర్సంటైల్‌ ఇవ్వడానికి మరికొద్ది రోజులు సమయం పట్టవచ్చని భావిస్తున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని