టెలికాంకు జోష్‌

ప్రధానాంశాలు

టెలికాంకు జోష్‌

ఆ రంగంలో 100% ఎఫ్‌డీఐలకు అనుమతి
ఏజీఆర్‌ బకాయిల చెల్లింపుపై నాలుగేళ్ల మారటోరియం
వొడాఫోన్‌ ఐడియా సహా పలు కంపెనీలకు ఉపశమనం
రూ.పాతిక వేలకోట్లకు పైగా నిధులతో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు
7.5 లక్షల కొత్త ఉద్యోగాలకు వీలు
కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు

దిల్లీ: సంస్కరణల పథంలో మోదీ సర్కారు మరో కీలక ముందడుగు వేసింది. ఇప్పటివరకు టెలికాం సంస్థల్లోకి నేరుగా 49% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) అనుమతి ఉండగా, ఇకపై 100 శాతాన్ని అనుమతించనున్నట్లు ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన దిల్లీలో బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఏజీఆర్‌ బకాయిల చెల్లింపుపై నాలుగేళ్లపాటు మారటోరియం విధించడం ద్వారా టెలికాం కంపెనీలకు మరో తీపి కబురు అందించింది. దీంతో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, ఆర్‌కామ్‌ వంటి సంస్థలకు  వెసులుబాటు దక్కనుంది. తమ ప్రాధాన్య జాబితాలోని ‘భారత్‌లో తయారీ’కి ఊపునిచ్చే దిశగా కేబినెట్‌ రూ.పాతిక వేల కోట్లకుపైగా ప్రోత్సాహకాలను ప్రకటించింది. వాహనాలు, వాహన విడిభాగాలు, డ్రోన్ల తయారీ పరిశ్రమలకు ఉత్పత్తి ఆధారిత విధానంలో ఈ నిధులు దక్కనున్నాయి. దేశంలో కొత్తగా 7.5 లక్షల ఉద్యోగాల సృష్టికి అవి వీలు కల్పిస్తాయని అంచనా.

పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని