భర్తపై ప్రేమతో...!

ప్రధానాంశాలు

భర్తపై ప్రేమతో...!

భర్తపై ప్రేమతో ఆయన సమాధి పక్కనే తమ సమాధులు ఉండాలని బతికుండగానే వాటిని నిర్మించుకున్న మహిళల ఉదంతమిది. అనంతపురం మండలం కామారుపల్లి గ్రామానికి చెందిన కురబ రాగే పెద్ద కొండన్నది సామాన్య రైతు కుటుంబం. ఆయనకు అంజినమ్మ, యల్లమ్మ ఇద్దరు భార్యలు. వీరికి సంతానం లేదు.   సంపాదించిన రూ.5 కోట్లు సేవకు ఖర్చు చేశారు. ఏడాది కిందటే కొండన్న మృతిచెందారు. ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా కామారుపల్లిలోని సొంత పొలంలో ఓ ఘాట్‌ కట్టించారు. అందులో భర్త సమాధికి ఇరువైపులా అంజినమ్మ, యల్లమ్మ సమాధులూ నిర్మించుకున్నారు.

- న్యూస్‌టుడే, అనంతపురం


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని