రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.47%

ప్రధానాంశాలు

రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.47%

కరోనా కేసులు తగ్గుముఖం

వైద్యఆరోగ్యశాఖ నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 0.47 శాతంగా నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. గత నెల(ఆగస్టు) 9 నుంచి ఈ నెల(సెప్టెంబరు) 5 వరకూ కేసుల నమోదును పరిశీలిస్తే రాష్ట్రంలో కొవిడ్‌ తగ్గుముఖం పడుతున్నట్లుగా వెల్లడైంది. ఈ తేదీల్లో మొత్తంగా 21,46,085 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 10,137 పాజిటివ్‌ కేసులు గుర్తించినట్లుగా వైద్యఆరోగ్యశాఖ తాజా నివేదికలో పేర్కొంది. అత్యధికంగా కుమురంభీం జిల్లాలో 1.96 శాతం పాజిటివిటీ రేటు నమోదు కాగా.. నాలుగు జిల్లాల్లో ఒక శాతానికిపైగా.. 29 జిల్లాల్లో అంతకంటే తక్కువగా పాజిటివిటీ రేటు నిర్ధారణ అయింది. నిత్యం సగటున 89,286 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లుగా నివేదికలో ఆరోగ్యశాఖ తెలిపింది. గత నెల 9 నుంచి ఈ నెల 5 వరకూ చేసిన మొత్తం పరీక్షల్లో యాంటీజెన్‌ పరీక్షలు 18,92,352 కాగా.. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు 2,53,733గా నమోదయ్యాయి. మొత్తం పరీక్షల్లో 11.82 శాతం మాత్రమే ఆర్టీపీసీఆర్‌ పరీక్షలున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో 49,359 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో కేవలం 22(0.04 శాతం) మాత్రమే ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు, అలాగే నారాయణపేట జిల్లాలో మొత్తంగా 7,563 పరీక్షలు నిర్వహించగా.. ఇందులో కేవలం 11 మాత్రమే ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలను నిర్వహించినట్లుగా నివేదికలో పొందుపర్చారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని