కొత్త పత్తికి రికార్డు ధర రూ.7,610

ప్రధానాంశాలు

కొత్త పత్తికి రికార్డు ధర రూ.7,610

‘మద్దతు’ కన్నా రూ.1,785 అధికం

వరంగల్‌ మార్కెట్‌, న్యూస్‌టుడే: వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ బుధవారం కొత్తపత్తి రాకతో కళకళలాడింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామ రైతు కొమురయ్య తెచ్చిన 14 బస్తాల కొత్త పత్తికి రికార్డుస్థాయిలో క్వింటాకు రూ.7,610 ధర పలికింది. ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డితో కలిసి, మార్కెట్‌ ఛైర్మన్‌ దిడ్డి భాగ్యలక్ష్మి కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు పాత పత్తికి రూ.8,210 ధర రికార్డు కాగా, కొత్త పత్తికి రూ.7,610 అని మార్కెట్‌ వర్గాలంటున్నాయి. పత్తికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు రూ.5,825 కాగా అంతకంటే రూ.1,785 ధర అధికంగా పలకడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని