ఏపీపై చర్యలు తీసుకోండి

ప్రధానాంశాలు

ఏపీపై చర్యలు తీసుకోండి

‘పోతిరెడ్డిపాడు’పై కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్‌ నీటిని మళ్లించకుండా చర్యలు తీసుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ మరోసారి కోరింది. వరద సమయంలో ఏపీ తీసుకున్న మిగులు జలాలను వారికున్న కేటాయింపులో లెక్కగట్టాలని.. తెలంగాణ తన వాటా నీటిని ఉమ్మడి రిజర్వాయర్లలో నిల్వ చేసుకొని వచ్చే నీటి సంవత్సరంలో వాడుకోవడానికి అనుమతించాలని కోరింది. కేంద్ర జలసంఘం, బచావత్‌ ట్రైబ్యునల్‌, ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం మార్గదర్శకాలకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్‌ నీటిని మళ్లిస్తోందని పేర్కొంటూ కృష్ణా బోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ బుధవారం లేఖ రాశారు. శ్రీశైలం 880 అడుగులకు పైన ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు ద్వారా 34 టీఎంసీలను ఏపీ తీసుకోవాల్సి ఉందన్నారు. అయితే ఈ ఏడాది జూన్‌ 1 నుంచి సెప్టెంబరు 20 వరకు పోతిరెడ్డిపాడు ద్వారా 76.39 టీఎంసీలు, హంద్రీనీవా ద్వారా 9.28 టీఎంసీలు కలిపి.. మొత్తం 85.67 టీఎంసీలు తీసుకుందన్నారు. తెలంగాణ కల్వకుర్తి ద్వారా 7.47 టీఎంసీలు మాత్రమే తీసుకుందని లేఖలో వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని