మరింత గడువు కావాలి

ప్రధానాంశాలు

మరింత గడువు కావాలి

పాలమూరు-రంగారెడ్డిపై ఎన్జీటీని కోరిన నిపుణుల కమిటీ

ఈనాడు, హైదరాబాద్‌: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై తుది నివేదికను సమర్పించేందుకు రెండు నెలల గడువు కావాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) నియమించిన నిపుణుల కమిటీ కోరింది. ఎత్తిపోతల పనులు జరుగుతున్నాయని తాగునీటి పనులు ఇందులో భాగమని పేర్కొంది. అక్రమ మైనింగ్‌ జరుగుతున్న దాఖలాలు లేవని, దీనిపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వడానికి నెలరోజుల సమయం కావాలని అడిగింది. ఈ మేరకు రెండు మధ్యంతర నివేదికలను కమిటీ ఎన్జీటీకి సమర్పించింది. తాగునీటి పేరుతో పర్యావరణ అనుమతి లేకుండా సాగునీటి పథకం నిర్మాణాన్ని కొనసాగిస్తున్నందున చర్య తీసుకోవాలని ఒకరు, ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ పరిధిలో అక్రమ మైనింగ్‌ జరుగుతుందని ఇంకొకరు ఎన్జీటీని ఆశ్రయించారు. వీటిపై విచారణ జరిపిన ఎన్జీటీ, వాస్తవాలను నివేదించేందుకు ఏడుగురితో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఈ నెల 15, 16 తేదీలలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పరిశీలించింది. 20న సమావేశమై చర్చించింది. ‘‘నార్లాపూర్‌, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్‌ రిజర్వాయర్లతోపాటు ఇతర పనులను పరిశీలించాం. తాగునీటి సరఫరాతోపాటు ఎత్తిపోతలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. చీఫ్‌ ఇంజినీర్‌ నుంచి కొన్ని వివరాలు, డాక్యుమెంట్లు కోరాం. పూర్తి స్థాయి నివేదికను అందజేయడానికి రెండు నెలల సమయం కావాలి. అలాగే చెరువుల్లో పూడికతీత జరుగుతోంది. అయితే ఇది అక్రమ మైనింగ్‌ కిందకు రాదు. ఈ నివేదిక సమర్పించడానికి నెల రోజుల సమయం కావాలి’’ అని కోరింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని