ప్రతి సభ్యునికి మాట్లాడే అవకాశం

ప్రధానాంశాలు

ప్రతి సభ్యునికి మాట్లాడే అవకాశం

స్పీకర్‌, మండలి ప్రొటెం ఛైర్మన్ల వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో శుక్రవారం ప్రారంభమయ్యే శాసనసభ, మండలి సమావేశాల్లో ప్రతి సభ్యునికి మాట్లాడే అవకాశం ఇస్తామని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ప్రొటెం ఛైర్మన్‌ భూపాల్‌రెడ్డిలు తెలిపారు. సభ్యులు విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన శాసనసభ సమావేశాలు సమర్థంగా జరుగుతున్నాయని అన్నారు. ఉభయ సభల సన్నద్ధతపై వారు గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అన్ని పార్టీలు సహకరించాలని ఈ సందర్భంగా వారు కోరారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, శాసనసభా కార్యదర్శి నర్సింహాచార్యులు తదితరులు ఇందులో పాల్గొన్నారు. శాసనసభ సమావేశాల నేపథ్యంలో అన్ని శాఖల కార్యదర్శులతో బీఆర్‌కే భవన్‌లో సోమేశ్‌ కుమార్‌ సమీక్ష నిర్వహించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని