ఆ బియ్యం తీసుకుంటారా..

ప్రధానాంశాలు

ఆ బియ్యం తీసుకుంటారా..

కేంద్రాన్ని కోరిన రాష్ట్రం

పీయూష్‌ గోయల్‌తో  నేడు సీఎం కేసీఆర్‌ భేటీ

ఈనాడు, హైదరాబాద్‌: గడువులోగా కేంద్రానికి ఇవ్వని బియ్యం వ్యవహారంలో సందిగ్ధత నెలకొంది. 2019-20 వానాకాలం సీజనులో ఆరేడు నెలలు గడువు పొడిగించినా తెలంగాణలోని పలువురు మిల్లర్ల నుంచి 1.01 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి అందలేదు. కేంద్రం ఆదేశాల మేరకు మిల్లుల్లో ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల అధికారులు చేపట్టిన తనిఖీల్లో సుమారు 32 వేల మెట్రిక్‌ టన్నులు లేనట్లు గుర్తించి నివేదిక పంపింది. ఆ మేరకు తమ కోటా నుంచి తొలగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు రూ.300 కోట్ల వరకు భారం పడింది. తాజాగా ఆ బియ్యాన్ని అందజేసేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖను రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కోరింది. 

ఇక ఉప్పుడు బియ్యం అదనంగా సుమారు 20 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు తీసుకునేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసి వారం అవుతున్నా ఉత్తర్వులు రాలేదు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దిల్లీ వెళ్లిన సీఎం ఈ వ్యవహారాన్ని కొలిక్కి తీసుకువచ్చేందుకు ఆదివారం కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలవనున్నారు. పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి కూడా దిల్లీ వెళ్లారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని