ఓబీసీ కమిషన్‌తో భరోసా!

ప్రధానాంశాలు

ఓబీసీ కమిషన్‌తో భరోసా!

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌
జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌ : ఓబీసీ కమిషన్‌ ఎంతో మందిలో ధైర్యం, భరోసా నింపిందని, రాజ్యాంగబద్ధత కల్పించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో సమస్యల్ని పరిష్కరించిందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. కమిషన్‌ పనితీరును దృఢంగా మార్చడంలో ప్రధాని మోదీ చొరవ ఎంతో ఉందన్నారు. ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం ‘కాన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇండియా-ఓబీసీ రిజర్వేషన్స్‌’ అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

కావాల్సింది బర్లు, గొర్లు కాదు: దత్తాత్రేయ

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ మాట్లాడుతూ బీసీలు బాగుపడేందుకు కావాల్సింది బర్లు, గొర్లు కాదన్నారు. ఉద్యోగాలు, విశ్వవిద్యాలయాల్లో 27 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, బీసీల జనాభా 52శాతం వరకు ఉంటుందని లెక్కలు చెబుతున్నాయన్నారు. జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్‌ ఛైర్మన్‌ భగవాన్‌లాల్‌ సహాని,  జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి, కాంగ్రెస్‌ నేత దాసోజు శ్రవణ్‌ మాట్లాడారు.

కొద్దిసేపు రసాభాస

దత్తాత్రేయ ప్రసంగ ప్రారంభ సమయంలో సభలో కాసేపు రసాభాస జరిగింది. కొందరు బీసీ సంక్షేమ సంఘం నేతలు ‘బీసీల ఐక్యత వర్ధిల్లాలి’ ‘కులగణన’ చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో కొందరు ముష్టిఘాతాలకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని బయటకు తీసుకెళ్లారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని