అంకితభావానికి చిరునామా తపాలాశాఖ

ప్రధానాంశాలు

అంకితభావానికి చిరునామా తపాలాశాఖ

సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ప్రశంస

బోరబండ, న్యూస్‌టుడే: కొవిడ్‌ క్లిష్ట పరిస్థితుల్లోనూ అనుకున్న లక్ష్యాలను సాధించి తపాలా అధికారులు వృత్తి పట్ల అంకితభావానికి చిరునామాగా నిలిచారని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ప్రశంసించారు. తపాలా సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఆసరా పింఛను నగదుతో పాటు 29,794 పట్టాదారు పాసుపుస్తకాలు అందజేయడం గొప్ప విషయమన్నారు. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన ‘డాక్‌ సేవ’ అవార్డులు- 2021 ప్రదానోత్సవంలో సీఎస్‌ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం తపాలా శాఖకు సహకారం అందిస్తుందని చెప్పారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా రాష్ట్రానికి చెందిన పోరాట యోధులు కుమురంభీం, చాకలి ఐలమ్మ, రావి నారాయణరెడ్డి, మఖ్దూం మొహియుద్దీన్‌ పేరిట ప్రత్యేక కవర్లు విడుదల చేయడం హర్షణీయమని తెలిపారు. తెలంగాణ సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ ఎస్‌.రాజేందర్‌కుమార్‌, హైదరాబాద్‌ ప్రాంతీయ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ డాక్టర్‌ పి.వి.ఎస్‌.రెడ్డి, ప్రధాన కార్యాలయ ప్రాంత పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ టి.ఎం.శ్రీలత, తపాలా సేవల సంచాలకుడు కె.ఎ.దేవరాజ్‌ పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని