కేసీఆర్‌కు మద్దతుగా రెండు నామినేషన్లు

ప్రధానాంశాలు

కేసీఆర్‌కు మద్దతుగా రెండు నామినేషన్లు

తెరాస మహిళా మంత్రులు, నేతలు
మేయర్ల సంఘం ప్రతిపాదన

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్ష పదవికి కేసీఆర్‌ పేరును ప్రతిపాదిస్తూ సోమవారం రెండోరోజు మరో రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. తెరాస మహిళా విభాగం తరఫున రాష్ట్రమంత్రులు సత్యవతి రాథోడ్‌, సబితారెడ్డ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు రేఖానాయక్‌, హరిప్రియ, పార్టీ మహిళా అధ్యక్షురాలు గుండు సుధారాణి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి పార్టీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాస్‌రెడ్డికి తెలంగాణభవన్‌లో నామినేషన్‌ పత్రాలు అందజేశారు. అన్ని కార్పొరేషన్ల మేయర్ల సంఘం తరఫున విజయలక్ష్మి, సుధారాణితో పాటు నిజామాబాద్‌, ఖమ్మం, రామగుండం, నిజాంపేట, పీర్జాదిగూడ, బోడుప్పల్‌, బండ్లగూడ, బడంగ్‌పేట మేయర్లు నీతూకిరణ్‌, నీరజ, అనిల్‌కుమార్‌, నీలగోపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, మహేందర్‌గౌడ్‌, పారిజాతరెడ్డిలు నామినేషన్‌లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే చరిత్ర సృష్టించిన పార్టీ తెరాసకు కేసీఆర్‌ అధ్యక్షునిగా ఉండాలని, రాజకీయాలకు సరైన నిర్వచనం ఇచ్చి ఆయన అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని