36 గంటలపాటు చంద్రబాబు నిరసన దీక్ష

ప్రధానాంశాలు

36 గంటలపాటు చంద్రబాబు నిరసన దీక్ష

నేటి ఉదయం 8 గంటలకు ప్రారంభం

ఈనాడు, అమరావతి: తెదేపా కేంద్ర కార్యాలయంపై దుండగుల దాడి, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాలపై వైకాపా నేతలు, కార్యకర్తల దాడి యత్నాలకు నిరసనగా తెదేపా అధినేత చంద్రబాబు 36 గంటల దీక్ష చేపడుతున్నారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 8 గంటల వరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన నిరసన దీక్ష కొనసాగిస్తారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంపై చేస్తున్న ఈ పోరాటానికి రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు, పౌర సంఘాలు కలసి రావాలని తెదేపా ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. చంద్రబాబుతో పాటు పార్టీ ముఖ్య నేతలు దీక్షలో పాల్గొంటారు.

అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ కోరిన చంద్రబాబు
పార్టీ కార్యాలయంపై దాడి అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు, ఆయనను స్వయంగా కలసి పరిస్థితిని వివరించాలని నిర్ణయించారు. అమిత్‌షాను కలిసేందుకు ఆయన అపాయింట్‌మెంట్‌ కోరినట్టు తెలిసింది.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని