హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణం

ప్రధానాంశాలు

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ శుక్రవారం ప్రమాణం చేశారు. ముంబయి హైకోర్టు నుంచి బదిలీపై వచ్చిన జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌తో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ ప్రమాణం చేయించారు. రిజిస్ట్రార్‌ జనరల్‌ డి.నాగార్జున్‌ బదిలీ ఉత్తర్వులను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులతోపాటు, అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌, బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఇంకా అదనపు సొలిసిటర్‌ జనరల్‌ టి.సూర్యకరణ్‌రెడ్డి, సహాయ సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌.రాజేశ్వరరావు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సి.ప్రతాప్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. భోజన విరామ సమయంలో హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్‌ నేతృత్వంలో కొత్త న్యాయమూర్తికి స్వాగతం పలుకుతూ సన్మానం చేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని