ఐదు జిల్లాల్లో 75 శాతం అడవి కబ్జా

ప్రధానాంశాలు

ఐదు జిల్లాల్లో 75 శాతం అడవి కబ్జా

రాష్ట్రవ్యాప్తంగా 11.11 శాతం ఆక్రమణలు

ముఖ్యమంత్రికి నివేదిక అందించనున్న అటవీశాఖ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా 66.33 లక్షల ఎకరాల అటవీ భూములు ఉంటే అందులో 11.11 శాతం ప్రాంతం ఆక్రమణల పాలైనట్లు అటవీశాఖ గుర్తించింది. మహబూబాబాద్‌, కొత్తగూడెం, ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, ములుగు.. ఈ అయిదింటిని అత్యంత సమస్యాత్మక జిల్లాలుగా భావిస్తోంది. అత్యధికంగా మహబూబాబాద్‌లో నాలుగో వంతుకు పైగా భూములు ఆక్రమణల్లో చిక్కుకున్నాయి. అన్ని జిల్లాల్లో కలిపి 7.37 లక్షల ఎకరాలు అన్యులపరం కాగా.. అందులో 5.31 లక్షల ఎకరాలు అంటే 75 శాతం మేర ఐదు జిల్లాల్లోనే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాల వారీగా ఉన్న అటవీప్రాంతం, అందులో ఆక్రమణలకు గురైంది ఎంతన్న లెక్కలతో రాష్ట్ర అటవీశాఖ నివేదిక రూపొందించింది. పోడు భూముల అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో శనివారం సమావేశం జరగనుంది. దీనికి ముందే ఈ వివరాల్ని అటవీశాఖ వర్గాలు సీఎంకు అందించనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో అటవీ ఆక్రమణల లెక్కలతో పాటు భూముల సంరక్షణ, పచ్చదనం పెంపు అంశాలపైనా ఆశాఖ దృష్టిపెట్టింది. 13 జిల్లాల కలెక్టర్లతో మూడురోజులపాటు సమావేశమైంది. పోడు భూముల సమస్య పరిష్కారానికి కార్యాచరణ మొదలైన క్రమంలో కొన్నిజిల్లాల్లో తాజాగా ఆక్రమణలు మొదలైనట్లు అధికారులు చెబుతున్నారు. యాదాద్రి జిల్లా నారాయణపూర్‌ మండలం రాచకొండ అటవీప్రాంతం (రాచకొండ బ్లాక్‌, 204 కంపార్ట్‌మెంట్‌)లో గురువారం ఆక్రమణ ప్రయత్నాలు జరగ్గా అటవీ అధికారులు అడ్డుకున్నారు.


జిల్లాల వారీగా ఆక్రమణల వివరాలు

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని