రేపు దిల్లీకి 18 మంది తెదేపా బృందం

ప్రధానాంశాలు

రేపు దిల్లీకి 18 మంది తెదేపా బృందం

చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రపతిని కలసి వినతిపత్రం

ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని విజ్ఞప్తి చేయనున్న నేతలు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం పేట్రేగుతోందని, మాదకద్రవ్యాలకు, గంజాయి సాగుకు ఆంధ్రప్రదేశ్‌ని కేంద్రంగా మార్చిందని, ప్రభుత్వంలోని పెద్దలే వీటిని ప్రోత్సహిస్తున్నారని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కి ఫిర్యాదు చేయాలని తెదేపా నిర్ణయించింది. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, శాంతిభద్రతలు అదుపు తప్పాయని, కాబట్టి 356వ అధికరణ ప్రకారం రాష్ట్రపతి పాలన విధించాలని కోరనుంది. సోమవారం మధ్యాహ్నం 12.30కు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. కొవిడ్‌ దృష్ట్యా చంద్రబాబు సహా ఐదుగురికే అనుమతి లభించింది. అయినా 18 మంది వెళ్లాలని నిర్ణయించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీలు, కొందరు ముఖ్యనేతలు వెళ్తున్నారు. వీరు సోమ, మంగళవారాల్లో దిల్లీలోనే ఉంటారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షానూ కలిసి ఫిర్యాదు చేయాలని భావిస్తున్న తెదేపా వారి సమయం కోసమూ ప్రయత్నిస్తోంది. దిల్లీ పర్యటనపై చంద్రబాబు శనివారం ఉదయం ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్య నేతలతో సమావేశమై చర్చించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని