మానవ హక్కుల కమిషన్‌ బెదిరించింది

ప్రధానాంశాలు

మానవ హక్కుల కమిషన్‌ బెదిరించింది

 సంతకం చేయకుంటే సీబీఐకి ఫిర్యాదు చేస్తామంది

జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ ఎదుట ఇన్‌స్పెక్టర్‌ వాంగ్మూలం

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) బృందం తనను బెదిరించి సంతకం తీసుకుందని చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న ఇన్‌స్పెక్టర్‌ నర్సింహారెడ్డి బుధవారం జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌కు వాంగ్మూలమిచ్చారు. గతంలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ విచారణలో నర్సింహారెడ్డి వెల్లడించిన అంశాల గురించి కమిషన్‌ ఆరా తీయగా ఆయన పైవిధంగా స్పందించారు. తాము రాసిన నివేదికపై సంతకం చేయకుంటే సీబీఐకి ఫిర్యాదు చేస్తామని ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యులు బెదిరించారని వెల్లడించారు. ఆ నివేదికలో వారు ఏం రాసుకున్నారో తనకు అంతగా గుర్తు లేదన్నారు. ఎన్‌కౌంటర్‌ ఉదంతరం గురించి కమిషన్‌ పలు ప్రశ్నలడిగింది. ‘దిశ’ హత్యాచార కేసు నిందితుడు ఆరిఫ్‌ తన పిస్టల్‌ను లాక్కొని కాల్పులు జరిపిన తీరు గురించి నర్సింహారెడ్డి వివరించారు. అనంతరం నిందితులు కాల్పులకు దిగడంతో తామూ కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న మరో ఇన్‌స్పెక్టర్‌ లాల్‌మదార్‌ను కూడా కమిషన్‌ విచారించింది. గురువారం కూడా లాల్‌మదార్‌ విచారణ కొనసాగనుంది.

ఎఫ్‌ఎస్‌ఎల్‌కు కమిషన్‌ లేఖ

మంగళవారం విచారణ సందర్భంగా పౌచ్‌లో పిస్టల్‌ ధరించి రావాలని కమిషన్‌ ఆదేశించడంతో నర్సింహారెడ్డి బుధవారం ఆయుధాన్ని వెంట తెచ్చుకున్నారు. పౌచ్‌ అందుబాటులో లేకపోవడంతో తేలేదని తెలిపారు. ఎన్‌కౌంటర్‌ సమయంలో వినియోగించిన పౌచ్‌ ఎక్కడుందని అడగ్గా.. కేసు దర్యాప్తు బృందం తీసుకుందన్నారు. ఆ పౌచ్‌ కోసం ఫొరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు కమిషన్‌ లేఖ రాసింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని