ఈటీవీ భారత్‌కు ఉజ్వల భవిష్యత్తు

ప్రధానాంశాలు

ఈటీవీ భారత్‌కు ఉజ్వల భవిష్యత్తు

మీడియా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన రామోజీరావు
కొనియాడిన కర్ణాటక ముఖ్యమంత్రి

బెంగళూరులోని ఈటీవీ భారత్‌ కార్యాలయాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: మీడియా రంగంలో రామోజీరావు విప్లవాత్మక మార్పులు తెచ్చారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై కొనియాడారు. ఆయన గురువారం బెంగళూరులోని ఈటీవీ భారత్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ఈటీవీ భారత్‌ సమాచార వ్యవస్థల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రామోజీరావు దూరదృష్టి కలిగిన వ్యక్తి అని, ఆయన నేతృత్వంలో ప్రారంభమైన ఈటీవీ భారత్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని అన్నారు. భారత్‌లోని అన్ని భాషల్లో ఈటీవీ భారత్‌ ప్రసారం కావటం సంతోషకరమని చెప్పారు. వేగంగా విస్తరిస్తున్న ఈటీవీ భారత్‌ కర్ణాటకలోనూ మంచి ఆదరణ పొందుతోందని, ప్రజల జీవనంలో మమేకమవుతోందని బొమ్మై అన్నారు. భవిష్యత్తంతా డిజిటల్‌ మాధ్యమానిదేననీ, బహుళ భాషల్లో విభిన్న సమాచారాన్ని అందించే అద్భుత వేదిక అని అభిప్రాయపడ్డారు.  సామాన్యులు కూడా సెల్‌ఫోన్ల ద్వారా చూడగలిగే వ్యవస్థను డిజిటల్‌ మాధ్యమం కల్పిస్తుందని కొనియాడారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని