
ప్రధానాంశాలు
సుప్రీంకోర్టు స్పష్టీకరణ
దిల్లీ: హిందూ వారసత్వ చట్టం ప్రకారం మహిళలు తమ తండ్రి వారసులకు ఆస్తిని పంచి ఇవ్వొచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారిని పరాయి వ్యక్తులుగా చూడలేమని పేర్కొంది. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 15(1)(డి)ని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఆ సెక్షన్ ప్రకారం.. హిందూ మహిళ తన తండ్రి తరఫు వారసులకు కూడా ఆస్తిని పంచవచ్చునని తెలిపింది. ‘కుటుంబం’ అనే పదాన్ని విస్తృత భావనలో అర్థం చేసుకోవాలని.. కేవలం దగ్గరి బంధువులు / చట్టబద్ధ వారసులే అందులోకి వస్తారని భావించడం సరికాదని సూచించింది. జాగ్నో అనే మహిళకు సంబంధించిన కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. భర్త షేర్ సింగ్ మరణించిన తర్వాత ఆమె తన సోదరుడి కుమారులకు ఆస్తిని పంచారు. ఆ పంపకాన్ని షేర్ సింగ్ సోదరుడి వారసులు సవాలు చేశారు. వారి అప్పీలును న్యాయస్థానం తోసిపుచ్చింది. ఆస్తిపై జాగ్నోకు పూర్తి హక్కులు ఉన్న సంగతిని గుర్తుచేసింది.
ప్రధానాంశాలు
దేవతార్చన

- Curfew: తెలంగాణలో నేటి నుంచి రాత్రి వేళ!
- మీ పేరుపై ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకోండి
- తొలుత జ్వరం అనుకుని.. చివరి నిమిషంలో మేల్కొని..
- కొవిడ్-19 ఎందుకింత ఉద్ధృతం?ఎప్పుడు ప్రమాదకరం?
- Corona Vaccine : 44 లక్షల డోసులు వృథా
- Horoscope: ఈ రోజు రాశి ఫలం
- భారత్లో వ్యాక్సిన్లకు అమెరికా అడ్డుపుల్ల..!
- కార్చిచ్చులా కరోనా
- India Corona: కాస్త తగ్గిన కొత్త కేసులు
- ఆ డేటా ఫోన్లో ఉంటే డిలీట్ చేయండి: ఎస్బీఐ