Singareni Strike: సింగరేణిలో సమ్మె సైరన్‌!

ప్రధానాంశాలు

Singareni Strike: సింగరేణిలో సమ్మె సైరన్‌!

యాజమాన్యానికి అధికార సంఘం నోటీసు
బొగ్గు బ్లాకుల పరిరక్షణ, సమస్యలపై పోరాటం

వర్కింగ్‌ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న వెంకట్రావు

గోదావరిఖని, న్యూస్‌టుడే: సింగరేణిలో సమ్మెకు అధికార సంఘం సిద్ధమైంది. వర్కింగ్‌ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. నాలుగు బొగ్గు బ్లాకుల పరిరక్షణే లక్ష్యంగా డిసెంబరు 9, లేదా ఆ తర్వాత సమ్మెలోకి దిగేందుకు నిర్ణయించింది. ఈ మేరకు సింగరేణి ఛైర్మన్‌తో పాటు ఆర్‌ఎల్‌సీలకు గురువారం సమ్మె నోటీసు ఇచ్చింది. సింగరేణికి చెందిన కెకె-6, కోయగూడెం బ్లాక్‌-3, సత్తుపల్లి బ్లాకు-3, శ్రావణ్‌పల్లి బొగ్గు బ్లాకులను వేలం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ సమ్మె చేపట్టనున్నట్లు అందులో పేర్కొన్నారు. మెయిల్‌ ద్వారా సమ్మె నోటీసు పంపినట్లు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(తెబొగకాసం) అధ్యక్షుడు బి.వెంకట్రావు తెలిపారు. సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం బహిరంగ వేలానికి ప్రకటన చేయడాన్ని తీవ్రంగా ఖండించడంతో పాటు మరికొన్ని కార్మికుల సమస్యలపై తెబొగకాసం తీవ్రంగా స్పందించింది. ఇటు యాజమాన్యం, అటు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె తలపెట్టేందుకు నిర్ణయించింది. బొగ్గు బ్లాకుల వేలం రద్దుతో పాటు వారసుల వయో పరిమితిని 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్లలో పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని