విశ్వవేదికపై బతుకమ్మ.. నేడు బుర్జ్‌ ఖలీఫాపై ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ప్రదర్శన

ప్రధానాంశాలు

విశ్వవేదికపై బతుకమ్మ.. నేడు బుర్జ్‌ ఖలీఫాపై ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ప్రదర్శన

ఈనాడు, హైదరాబాద్‌: తెరాస ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బతుకమ్మ ఘనతను మరోసారి విశ్వవేదికపై చాటనున్నారు. ప్రపంచంలోనే ఎత్తయిన దుబాయ్‌లోని బుర్జ్‌ఖలీఫాపై శనివారం రాత్రి 9.40 నిమిషాలకు, 10.40 నిమిషాలకు బతుకమ్మ వీడియో ప్రదర్శించనున్నారు. మూడేసి నిమిషాల నిడివిగల ఈ వీడియోల్లో తెలంగాణలో బతుకమ్మ ప్రాశస్త్యం, విశిష్టత, సంబురాల సంస్కృతిని తెలియజేస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటాన్ని సైతం మొత్తం సౌధంపై ప్రదర్శిస్తారు. బుర్జ్‌ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించబోయే తెర ప్రపంచంలోనే అతి పెద్దది. ఒకేసారి లక్ష మంది దీన్ని వీక్షించనున్నారు. ఈ కార్యక్రమం కోసం కవిత దుబాయ్‌ చేరుకున్నారు. బతుకమ్మ పండుగ ఖ్యాతిని ప్రపంచమంతటా చాటి చెప్పేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆమె తెలిపారు. తెలంగాణకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, తెలంగాణ జాగృతి నాయకులు, తెలంగాణ ప్రవాసులు యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు దీనికి హాజరు కానున్నారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని