స్పుత్నిక్‌ టీకా ఎంతమంది తీసుకున్నారంటే..

తాజా వార్తలు

Updated : 11/01/2021 18:06 IST

స్పుత్నిక్‌ టీకా ఎంతమంది తీసుకున్నారంటే..

వివరాలు వెల్లడించిన రష్యా

మాస్కో: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 1.5 మిలియన్ల ప్రజలకు స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌ అందించినట్లు రష్యా సోమవారం ప్రకటించింది. స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌కు ఆర్థిక సహకారాన్ని అందించిన రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(ఆర్డీఐఎఫ్) దీనిని ధ్రువీకరించింది. టీకా తీసుకున్నవారిలో రష్యాకు చెందినవారు ఎందరో, మిగతా దేశాలకు చెందిన వారు ఎందరో చెప్పలేమని ఆర్డీఐఎఫ్‌ ప్రతినిధి ఆర్న్సీ పాలాగిన్‌ తెలిపారు. సంబంధిత దేశాలు విడిగా ఈ సమాచారాన్ని అందిస్తాయన్నారు. గతేడాది ఆగస్టులో రష్యా వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేసిన మొదటిదేశంగా నిలిచింది. తర్వాత వెంటనే బిలియన్‌కు పైగా ఆర్డర్లు పొందినట్లు రష్యా ప్రకటించింది.

మరోవైపు ఈ నెలలో 8లక్షలకు పైగా రష్యన్లు స్పుత్నిక్‌ టీకాను తీసుకున్నట్టు  రష్యా ఆరోగ్యశాఖ మంత్రి మిఖైల్‌ మురాస్కో వెల్లడించారు. స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌ను అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు ప్రపంచారోగ్య సంస్థతో చర్చలు జరుపుతున్నట్లు రష్యా ఆరోగ్య మంత్రి సలహాదారు తెలిపారు. వ్యాక్సిన్‌కు ఈ విధమైన అనుమతి లభించినట్లైతే వ్యాక్సిన్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకోలేని దేశాలకు ప్రపంచారోగ్య సంస్థ స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌ను అందిస్తుంది. ప్రస్తుతం రష్యాలో రోజుకు సుమారుగా ఇరవైవేల కేసులు నమోదవుతున్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రష్యాలో సోమవారానికి 34,252,69 కేసులు, 62వేల మరణాలు నమోదయ్యాయి.

ఇవీ చదవండి..

కరోనా ఎఫెక్ట్‌: తొలిసారి బడ్జెట్‌ ప్రతులు లేకుండా..

‘నరసింహనాయుడు’ కథ అలా పుట్టింది..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని