Corona: అక్కడ 576 కొత్త కేసులు.. అందులో 128 మంది చిన్నారులే!

తాజా వార్తలు

Published : 12/08/2021 17:26 IST

Corona: అక్కడ 576 కొత్త కేసులు.. అందులో 128 మంది చిన్నారులే!

ఐజ్వాల్‌: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల ఈ మహమ్మారి ఉద్ధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ తాజాగా 41 వేలకు పైగా కొత్త కేసులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, గురువారం మిజోరంలో 576 కొత్త కేసులు నమోదు కాగా.. వీరిలో 128మంది చిన్నారుల్లోనే ఈ వైరస్‌ వెలుగుచూడటం గమనార్హం. మిజోరంలో గడిచిన 24గంటల వ్యవధిలో 6,192 శాంపిల్స్‌ను పరీక్షించగా.. పాజిటివిటీ రేటు 9.30శాతంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. కొత్త కేసులతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 46,896కి పెరిగిందన్నారు. అలాగే, కొత్తగా మరో ఇద్దరు కొవిడ్‌తో మృతిచెందడంతో ఆ సంఖ్య 173కి చేరిందని వివరించారు. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క ఐజ్వాల్‌ జిల్లాలోనే అత్యధికంగా 323 కేసులు వచ్చాయన్నారు. తాజాగా ఈ మహమ్మారి బారిన పడినవారిలో చిన్నారులతో పాటు ఎనిమిది మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్లు కూడా ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,989 యాక్టివ్‌ కేసులు ఉండగా.. రికవరీ రేటు 74శాతంగా ఉందని వివరించారు. ఇప్పటివరకూ 6.24లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయించగా.. వీరిలో 2.13 లక్షల మందికి రెండు డోసులూ అందినట్టు వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని