హసీనాపై హత్యాయత్నం.. ఉగ్రవాదులకు మరణశిక్ష

తాజా వార్తలు

Updated : 24/03/2021 00:34 IST

హసీనాపై హత్యాయత్నం.. ఉగ్రవాదులకు మరణశిక్ష

ఢాకా: బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాను హత్యకు కుట్ర పన్నిన 14 మంది ఇస్లామిక్‌ ఉగ్రవాదులకు అక్కడి న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. 2000 ఏడాదిలో ఆమెపై జరిగిన ఉగ్రదాడి కేసులో విచారణ చేపట్టిన దాకా ట్రిబ్యునల్‌ న్యాయస్థానం మంగళవారం ఈ మేరకు తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఇప్పటికే 9 మంది జైలుశిక్ష అనుభవిస్తుండగా, మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. మిగిలిన వారు అరెస్టు, లేదా లొంగిపోయిన తర్వాత శిక్షను అమలు చేయాలని తీర్పులో పేర్కొన్నారు. 

2000 ఏడాదిలో గోపాల్‌గంజ్‌ జిల్లాలోని కోటలిపరలో ఎన్నికల ర్యాలీకి వెళ్లిన హసీనాపై ఉగ్రవాదులు దాడికి యత్నించారు. ‘హర్కతుల్‌ జీహాద్‌ బంగ్లాదేశ్‌’కు చెందిన ఉగ్రవాదులు బాంబులు పెట్టి ఆమెను హతమార్చాలని చూశారు. పక్కా సమాచారంతో బాంబు నిర్వీర్య బృందాలు వాటిని తొలగించడంతో దాడి నుంచి హసీనా బయటపడ్డారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని