Rape cases in India: నాలుగేళ్లలో 1.71 లక్షల అత్యాచార కేసులు..!

తాజా వార్తలు

Published : 04/08/2021 20:34 IST

Rape cases in India: నాలుగేళ్లలో 1.71 లక్షల అత్యాచార కేసులు..!

దిల్లీ: దేశంలో.. 2015-19 మధ్య కాలంలో 1.71 లక్షల అత్యాచార కేసులు నమోదవడం యావత్ భారతావనిని కలవరపెడుతోంది. వీటిలో అత్యధిక కేసులు మధ్యప్రదేశ్‌ నుంచి నమోదు కావడం ఆ రాష్ట్ర ప్రజలు సహా ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. బుధవారం రాజ్యసభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ కుమార్‌ మిశ్రా ఈ మేరకు అత్యాచార కేసులకు సంబంధించిన గణాంకాలను వెల్లడించారు. ఆ నాలుగేళ్ల వ్యవధిలో మధ్యప్రదేశ్‌లో మొత్తం 22,753 అత్యాచార కేసులు నమోదైనట్టు తెలిపారు. ఆ రాష్ట్రం తర్వాత మహిళలపై ఎక్కువ అఘాయిత్యాలు రాజస్థాన్‌లో జరిగినట్లు పేర్కొన్నారు. అక్కడ 20,937 అత్యాచార కేసులు నమోదయ్యాయని వివరించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో 19,098, మహారాష్ట్రలో 14,707, దిల్లీలో 8,051 కేసులు నమోదైనట్టు వెల్లడించారు. ఆ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా.. 2015లో 34,651, 2016లో 38,947, 2017లో 32,559, 2018లో 33,356, 2019లో 32,033 అత్యాచార కేసులు సమోదయ్యాయి. 

 


 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని