వైష్ణోదేవికి 1,800 కేజీల బంగారం

తాజా వార్తలు

Updated : 25/03/2021 12:55 IST

వైష్ణోదేవికి 1,800 కేజీల బంగారం

దిల్లీ: జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ వైష్ణోదేవి ఆలయానికి గత ఇరవై ఏళ్లలో 1,800 కేజీల బంగారం విరాళంగా వచ్చిందని సమాచారహక్కు చట్టం ద్వారా తెలిసింది. బంగారంతోపాటు 4,700 కిలోల వెండి, రూ.2000 కోట్ల నగదు ఆలయానికి అందాయని వెల్లడైంది. సామాజిక కార్యకర్త హేమంత్‌ గునియా స.హ చట్టం కింద చేసిన దరఖాస్తు ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ‘వానా కాలం రానున్న నేపథ్యంలో ఆలయ బోర్డు ఈ డబ్బును యాత్రికులకు వసతులు కల్పించేందుకు ఉపయోగించాలి. ఈ ఆదాయాన్ని ప్రభుత్వ పాఠశాలల నిర్మాణానికి కూడా ఉపయోగించవచ్చు’ అని హేమంత్‌ గునియా తెలిపారు. ఆలయానికి భక్తుల తాకిడి గతేడాది భారీగా తగ్గిందని ఆర్టీఐ దరఖాస్తు ద్వారా తెలిసింది. కరోనా కారణంగా 2020లో కేవలం 17 లక్షల మందే ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని