Train accident: పాక్‌లో ఘోర రైలు ప్రమాదం

తాజా వార్తలు

Updated : 07/06/2021 13:02 IST

Train accident: పాక్‌లో ఘోర రైలు ప్రమాదం

36 మంది మృతి..పలువురికి గాయాలు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తోన్న రెండు రైళ్లు ఢీకొనడంతో.. దాదాపు 36 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారి సంఖ్య భారీగా ఉంటుందని స్థానిక మీడియా వెల్లడించింది. దక్షిణ పాక్‌కు చెందిన ఘోత్కిలోని రెతి-దహర్కి రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం సంభవించింది.

లాహోర్‌ వైపు వెళ్తోన్న సర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్.. కరాచీ నుంచి సర్గోధా వెళ్తున్న మిల్లత్‌ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురయ్యాయి. మిల్లత్‌ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో రెండు రైళ్లలో కలిపి వెయ్యి మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఘోత్కి డిప్యూటీ కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ..ఈ ప్రమాదంతో 13 నుంచి 14 బోగీలు పట్టాలు తప్పాయని తెలిపారు. దాదాపు ఎనిమిది బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయన్నారు. బోగీల మధ్య చిక్కుకున్నవారిని రక్షించేందుకు సమయం పడుతోందన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.  ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని