WHO: 200 కోట్ల టీకా డోసుల పంపిణీ
close

తాజా వార్తలు

Published : 05/06/2021 21:26 IST

WHO: 200 కోట్ల టీకా డోసుల పంపిణీ

కొవాగ్జిన్‌ కీలకపాత్ర పోషించిందన్న డబ్ల్యూహెచ్‌వో

జెనీవా: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 200 కోట్ల టీకా డోసుల పంపిణీ జరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ఇందులో 60 శాతం డోసులు మూడు దేశాలే వినియోగించుకున్నాయని, అమెరికా, భారత్‌, చైనా దేశాలే ఎక్కువ శాతం టీకాలను పొందినట్లు పేర్కొంది. 212 దేశాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కాగా, అందులో 10 దేశాలే 75 శాతం వ్యాక్సిన్లను పొందినట్లు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ సీనియర్ సలహాదారుడు బ్రూస్‌ ఐల్‌వల్డ్‌ అన్నారు. 127 దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేయడంలో భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా కీలక పాత్ర పోషించినట్లు పేర్కొన్నారు. చాలా దేశాలు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించేందుకు కొవాగ్జిన్‌ దోహదపడిందని ఆయన అన్నారు. 

అటు ప్రపంచవ్యాప్తంగా 10 శాతం జనాభా కలిగిన తక్కువ ఆదాయ దేశాలకు కేవలం 0.5 శాతం టీకాలు మాత్రమే పంపిణీ జరిగినట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. మధ్యాదాయ దేశాల పరిస్థితి కూడా పేద దేశాలతో పోలిస్తే అంత మెరుగ్గా ఏమీలేనట్లు అభిప్రాయపడింది.

చిన్నారులకు కరోనా టీకా వేయడం తమ దృష్టిలో అంత ప్రాధాన్యం కాదని డబ్ల్యూహెచ్‌వో శుక్రవారం వెల్లడించింది. చిన్న పిల్లలపై మహమ్మారి ప్రభావం అంత తీవ్రంగా ఉండదని, ప్రాణాంతకం కూడా కాబోదని పేర్కొంది. పిల్లలను పాఠశాలలకు పంపేముందు వ్యాక్సినేట్‌ చేయడం కూడా అత్యవసరమేమీ కాదని,  పాఠశాలల్లో వారిని చూసుకునే సిబ్బందికి, ఉపాధ్యాయులకు టీకాలు ఇస్తే మేలని తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని