close

తాజా వార్తలు

Published : 06/03/2021 13:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అంధుల హాస్టల్‌లో 28 మందికి కరోనా

ఉదయ్‌పుర్‌: రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో ఉన్న ఓ అంధుల హాస్టల్‌లో 28 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. అంబమాత పోలీసుస్టేషన్‌ పరిధి ప్రభుత్వ అంధ విద్యాలయంలోని ఓ ఉపాధ్యాయురాలికి ఇటీవల కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో విద్యార్థులందరికీ పాఠశాల యాజమాన్యం కొవిడ్‌ పరీక్షలు చేయించగా 28 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు తేలింది. స్థానికంగా ఈ విషయం కలకలం సృష్టించడంతో జిల్లా కలెక్టర్‌ చేతన్‌ దేవరాజ్‌, ఎస్పీ హాస్టల్‌కు వెళ్లి పరిస్థితులను సమీక్షించారు. వైరస్‌ సోకిన విద్యార్థులను ప్రత్యేక భవనంలోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. నెగెటివ్‌ వచ్చిన విద్యార్థులను మరో చోట ఉంచిన అధికారులు ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు.



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని