corona second wave:కోటిమంది ఉపాధికి దూరం..!

తాజా వార్తలు

Published : 02/06/2021 01:06 IST

corona second wave:కోటిమంది ఉపాధికి దూరం..!

97 శాతం ఇళ్లల్లో ఆదాయం తగ్గింది

దిల్లీ: కరోనా వైరస్ ప్రజల ఉపాధిని తీవ్రంగా దెబ్బకొట్టింది. రెండోసారి విజృంభణతో సంక్షోభం తీవ్రమైంది. ఈ రెండోదశ కారణంగా సుమారు కోటి మంది ఉద్యోగాలు కోల్పోయారు. 97శాతం కుటుంబాల ఆదాయం తగ్గిపోయింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ మహేశ్ వ్యాస్ ఈ లెక్కలు వెల్లడించారు.

నిపుణుల బృందం అంచనా ప్రకారం.. ఏప్రిల్‌లో 8శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు మే నెలలో 12శాతానికి చేరినట్లు మహేశ్ వ్యాస్ వెల్లడించారు. సుమారు కోటి ఉద్యోగాలు పోయినట్లు ఈ లెక్కలు సూచిస్తున్నాయన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగం కోల్పోయిన వారికి ఉపాధి లభించడం కష్టమేనని అంచనా వేశారు. సంఘటిత రంగంలో నాణ్యమైన ఉద్యోగాలు లభించడానికి ఏడాదైనా పట్టొచ్చని తెలిపారు. ఈ సంవత్సర కాలంలో ఆదాయాల తీరుతెన్నులపై 1.75 లక్షల గృహాలను సీఎంఐఈ సర్వే చేయగా.. ఆందోళన కలిగించే విషయాలు వెల్లడయ్యాయని ఆయన అన్నారు. 3 శాతం మంది తమ ఆదాయం పెరిగినట్లు చెబితే, 55 శాతం మంది ఆదాయం పడిపోయిందని వెల్లడించారు. అలాగే 42శాతం మంది ఆదాయం మాత్రం స్థిరంగా ఉన్నట్లు తెలిసింది. ‘ఈ స్థాయిలో ఉపాధి, ఆదాయం కోల్పోవడానికి కరోనా రెండోదశే కారణం. యథావిధిగా ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాక పూర్తిగా కాకపోయినా.. ఈ సమస్య కొంతమేర తీరుతుంది’ అని వ్యాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే నిరుద్యోగ రేటు 3 నుంచి 4 శాతం ఉంటే సాధారణంగా పరిగణించాలని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని