Covid: రెసిడెన్షియల్‌ స్కూల్‌లో కరోనా కలకలం.. 32 మంది విద్యార్థులకు పాజిటివ్

తాజా వార్తలు

Updated : 28/10/2021 20:26 IST

Covid: రెసిడెన్షియల్‌ స్కూల్‌లో కరోనా కలకలం.. 32 మంది విద్యార్థులకు పాజిటివ్

బెంగళూరు: కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో.. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలు పాఠశాలలకు పచ్చజెండా ఊపుతోన్న విషయం తెలిసిందే. తరగతుల నిర్వహణ సమయంలో కొవిడ్‌ నిబంధనలు పాటించాలని స్పష్టం చేస్తున్నాయి. అయితే, తాజాగా కర్ణాటకలోని ఓ రెసిడెన్షియల్‌ పాఠశాలలో ఏకంగా 32 మంది విద్యార్థులకు కరోనా సోకింది. ఇక్కడి కొడగు జిల్లా మడికెరిలోని జవహార్‌ నవోదయ విద్యాలయకు చెందిన 22 మంది బాలురు, 10 మంది బాలికలకు వైరస్‌ సోకింది. వీరంతా 9 నుంచి 12వ తరగతి లోపువారే. ఈ పాఠశాలలో మొత్తం 270 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారం క్రితం వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఎవరికీ ప్రమాదం లేదు: ప్రిన్సిపల్‌

బాధిత విద్యార్థుల్లో 10 మందికి లక్షణాలు కనిపించగా, 22 మందికి ఎటువంటి లక్షణాలు కనిపించలేదు. సిబ్బందిలో ఒకరికి సైతం పాజిటివ్‌గా తేలింది. వారికి జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై ప్రిన్సిపల్ పంకజాషన్ ఓ వార్తసంస్థతో మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్య విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరూ కోలుకుంటున్నారని చెప్పారు. క్యాంపస్‌ మొత్తాన్ని శానిటైజ్ చేసినట్లు, ఇతర ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఆరోగ్య అధికారి, ఇతర అధికారులు పాఠశాలను సందర్శించారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని