close

తాజా వార్తలు

రక్షకులకు రాష్ట్రపతి పురస్కారాలు

 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటన
 చిదంబరాన్ని అరెస్టు చేసిన సీబీఐ డీఎస్పీకి కూడా...

దిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సైన్యం, ఇతర రక్షణ విభాగాలకు చెందిన అధికారులకు రాష్ట్రపతి పురస్కారాలు ప్రకటించారు. మొత్తంగా 409 గ్యాలంటరీ, ఇతర రకాల అవార్డులు ఇవ్వనున్నారు. జమ్మూ-కశ్మీర్‌ పోలీసులకు అత్యధికంగా 108 అవార్డులు లభించాయి. సీఆర్‌ఫీఎఫ్‌కు 76, బీఎస్‌ఎఫ్‌కు 9, సశస్త్ర సీమా బల్‌కు 4, రైల్వే రక్షణ దళానికి ఒకటి, సీఐఎస్‌ఎఫ్‌కు 29 పతకాలు వచ్చాయి. మిగిలినవి సైన్యంలోని వివిధ విభాగాలకు లభించాయి. ఇవికాకుండా వివిధ రాష్ట్రాల పోలీసులకు 1,040 పతకాలు ప్రకటించారు. పోలీసు పతకాలు పొందిన వారిలో 151 మంది ఇండో-టిబెటన్‌ సరిహద్దు పోలీసు అధికారులు ఉన్నారు. 28 సీబీఐ అధికారులకు కూడా రాష్ట్రపతి పోలీసు పతకాలు లభించాయి. ఇందులో ఐఎన్‌ఎక్స్‌ కేసులో కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి పి.చిదంబరాన్ని అరెస్టు చేసిన డీఎస్పీ రామస్వామి పార్థసారధి కూడా ఉన్నారు. ఆయనే చిదంబరం కుమారుడు కార్తీని కూడా ఇదే కేసులో అరెస్టు చేశారు. విశిష్ట సేవలకుగానూ ఈ పురస్కారం లభించింది.

పురస్కారాలు పొందిన తెలుగు రాష్ట్రాల సైనికాధికారులు

శౌర్యచక్ర పురస్కారం
1.చల్లపల్లి నరసింహారావు (మరణానంతరం)- కేంద్ర హోంశాఖ
పరమ విశిష్ట సేవా పతకం
1. లెఫ్టినెంట్‌ జనరల్‌ పొదలి శంకర్‌ రాజేశ్వర్‌- శతఘ్ని దళం
అతి విశిష్ట సేవా పతకం
1. పందల నాగేశ్వరరావు- పదాతి దళం
2. వైస్‌అడ్మిరల్‌ కాళిదాస్‌ శ్రీనివాస్‌-నౌకా దళం
3. ఎయిర్‌ వైస్‌మార్షల్‌ గుత్తికొండ అమర్‌ ప్రసాద్‌ బాబు- వాయు సేన
4. ఎయిర్‌ వైస్‌మార్షల్‌ బవిశెట్టి చంద్రశేఖర్‌- వాయుసేన
5  ఎయిర్‌ వైస్‌మార్షల్‌ సత్తారు భానోజీరావు- వాయు సేన

విశిష్ట సేవా పతకం
బ్రిగేడియర్‌ అప్పల వెంకటరమేష్‌- ఆర్మీ మెడికల్‌ కార్ప్స్‌
కెప్టెన్‌ రవికుమార్‌- నౌకా దళం
గ్రూప్‌ కెప్టెన్‌ వాడపల్లి రవిసత్యనారాయణ రాజు- ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ (మెకానికల్‌)
గ్రూప్‌ కెప్టెన్‌ మంత శ్రీనివాస రామ్మోహన్‌- ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ (మెకానికల్‌)

సేన పతకం (గ్యాలంటరీ)
1. మేజర్‌ గుత్తి బాలాజీ నిరంజన్‌- ఆర్మీ ఏవియేషన్‌ కార్ప్స్‌
2. మేజర్‌ ఏ.శ్రీనివాసరెడ్డి- ద గ్రెనేడియర్స్‌- రాష్ట్రీయ రైఫిల్స్‌
3. హవల్దార్‌ బొమ్మాళి కిరణ్‌కుమార్‌- రాష్ట్రీయ రైఫిల్స్‌
4. నాయక్‌ కోట రఘునాథ్‌రెడ్డి- రాష్ట్రీయ రైఫిల్స్‌

సేన పతకం (డివోషన్‌ టూ డ్యూటీ)
1. కెప్టెన్‌ బి. నాగమల్లికార్జునరావు- ద కార్ప్స్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌
2. గ్రూప్‌ కెప్టెన్‌ కోసన రామారావు- వాయుసేన


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.