Black fungus: బాధితుల్లో 55% మందికి మధుమేహం

తాజా వార్తలు

Updated : 24/05/2021 14:33 IST

Black fungus: బాధితుల్లో 55% మందికి మధుమేహం

వెల్లడించిన కేంద్ర ఆరోగ్య మంత్రి

దిల్లీ: బ్లాక్‌ ఫంగస్(మ్యుకర్‌మైకోసిస్) వ్యాధి సోకినవారిలో 55శాతం మందికి మధుమేహం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. సోమవారం నిర్వహించిన మంత్రుల సమావేశంలో బ్లాక్‌ ఫంగస్‌కు సంబంధించిన సమాచారాన్ని తెలియజేశారు. ‘18 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 5,425 మ్యుకర్‌మైకోసిస్ కేసులు వెలుగుచూశాయి. వారిలో 4,556 మందికి గతంలో కొవిడ్ సోకింది. మొత్తం బాధితుల్లో 55శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నవారే ఉన్నారు’ అని మంత్రి వెల్లడించారు. 

వాతావరణంలో సహజంగా ఉండే మ్యుకర్ అనే ఫంగస్ వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ముఖ్యంగా కొవిడ్ సోకి, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి లేదా అతిగా స్పందించకుండా రోగనిరోధక వ్యవస్థను కట్టడి చేయడానికి స్టెరాయిడ్లను మితిమీరి వినియోగించిన వారికి ఇది ఎక్కువగా సోకే ప్రమాదం  ఉంది. అవయవ మార్పిడి జరిగిన వారికి, ఐసీయూలో చికిత్స పొందిన వారికి దీని ముప్పు ఎక్కువ. గాలి పీల్చుకున్నప్పుడు ఈ ఫంగస్ సైనస్‌కు, ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. కొవిడ్ రెండో దశలో ఈ తరహా కేసులు పెరుగుతుండటం సవాలుగా మారింది.

65 శాతం నమూనాల్లో B.1.617 కరోనా రకం..

జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేసిన 65 శాతం నమూనాల్లో B.1.617 కరోనా రకాన్ని గుర్తించినట్లు హర్షవర్ధన్‌ ఈ సమావేశంలో వెల్లడించారు. ‘25,739 నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్‌ను పరిశీలించగా 9,508 నమూనాల్లో ఆందోళన కలిగిస్తున్న రకాలను గుర్తించాం. అలాగే 65శాతం నమూనాల్లో B.1.617 రకం కనిపించింది’ అని మంత్రి తెలిపారు. భారత్‌లో రెండో దశ కరోనా ఉప్పెనకు ఈ రకమే కారణమని నిపుణులు అంటున్నారు. అలాగే ఈ కొత్త రకాన్ని మొదట ఇక్కడే గుర్తించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని