Airtel 5G: సెకన్‌కు వన్ గిగాబైట్ వేగం

తాజా వార్తలు

Published : 14/07/2021 01:20 IST

Airtel 5G: సెకన్‌కు వన్ గిగాబైట్ వేగం

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ ముంబయిలో నిర్వహించిన 5జీ ట్రయల్స్‌లో సెకన్‌కు వన్ గిగాబైట్ వేగాన్ని నమోదు చేసింది. ఫోనిక్స్ మాల్ వద్ద ప్రముఖ మొబైల్ కంపెనీ నోకియాతో కలిసి చేసిన ఈ  పరీక్షల్లో సెకనుకు వెయ్యి ఎంబీపీఎస్ వేగాన్ని అందుకున్నట్లు ఎయిర్‌టెల్ వర్గాలు తెలిపాయి. ఈ ట్రయల్‌ను 3,500 మెగా హెడ్జ్ పౌనపున్యం వద్ద నోకియాతో నిర్వహించినట్లు పేర్కొన్నాయి. కేంద్ర సాంకేతిక విభాగం డాట్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పరీక్షలు చేపట్టినట్లు తెలిపిన ఎయిర్‌టెల్ ఇదే తరహా ట్రయల్స్‌ను త్వరలో కోల్ కతా, బెంగళూరులో చేపట్టనుంది. దేశంలో మెట్రో నగరాల్లో ట్రయల్స్ నిర్వహించేందుకు 5జీ స్పెక్ట్రమ్‌ను ఎయిర్‌టెల్‌కు డాట్‌ కేటాయించింది. స్పెక్ట్రమ్ బ్యాండ్ 3,500మెగా హెడ్జ్, 28గిగా హెడ్జ్, 700మెగా హెడ్జ్‌ల పౌనపున్యం వద్ద 5జీ ట్రయల్స్ చేపట్టేందుకు ఎయిర్‌టెల్‌ను అనుమతించింది. ఈ ఏడాది మొదట్లో తొలిసారి హైదరాబాద్‌లో 5జీ ట్రయల్స్‌ను విజయవంతంగా నిర్వహించిన ఎయిర్‌టెల్ తాజాగా ముంబయిలోనూ ట్రయల్స్ పూర్తి చేసింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని