
తాజా వార్తలు
ఆ ఆరు రాష్ట్రాల్లోనే 60శాతం కేసులు!
రోజువారీ కేసుల్లో కేరళ టాప్
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినప్పటికీ, పండుగల అనంతరం కొన్ని ప్రదేశాల్లో తీవ్రత పెరిగింది. ప్రస్తుతం రోజువారీ కేసుల సంఖ్య మళ్లీ 40వేలు దాటింది. నిన్న ఒక్కరోజే 44,489 కేసులు నమోదుకాగా వీటిలో 60శాతం కేసులు ఆరు రాష్ట్రాల్లోనే రికార్డయ్యాయి. వీటిలో కేరళలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఇక మహారాష్ట్ర, దిల్లీ, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 524 మంది కొవిడ్ రోగులు మృత్యువాతపడగా వీటిలో 60శాతం ఆరు రాష్ట్రాల్లోనే చోటుచేసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే, మరణాల సంఖ్య ఎక్కువగా దిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, హరియాణా, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నట్లు తెలిపింది.
కేరళలో అత్యధిక కేసులు..
దేశంలో కరోనా వైరస్ విజృంభణ ప్రారంభమైన తొలినాళ్లలో వైరస్ కట్టడిలో కేరళ ముందు నిలిచింది. కానీ, ప్రస్తుతం రోజువారీ కేసుల్లో దేశంలోనే అత్యధికంగా నమోదు అవుతున్నాయి. నిన్న ఒక్కరోజే కేరళ వ్యాప్తంగా 6491 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్రలో 6159, దిల్లీలో 5246 కేసులు రికార్డయ్యాయి. ఇక రోజువారీ మరణాలు అత్యధికంగా దేశ రాజధాని దిల్లీలో చోటుచేసుకున్నాయి. 24గంటల వ్యవధిలో అక్కడ 99మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు.
8 రాష్ట్రాల్లోనే తీవ్రత అధికం..
ప్రతిరోజు నమోదవుతున్న కేసులు, మరణాలు కేవలం ఎనిమిది రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. దాదాపు 65శాతం కేసులు ఇక్కడే ఉండగా, 61 శాతం కొవిడ్ మరణాలు కూడా ఈ ఎనిమిది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. పంజాబ్‌లో కొవిడ్ మరణాల రేటు 3.16శాతం, మహారాష్ట్రలో 2.60శాతం, పశ్చిమ బెంగాల్లో 1.75శాతం, దిల్లీలో 1.60శాతంగా ఉంది. ఈ రాష్ట్రాల్లో కరోనా మరణాల రేటు జాతీయ సగటు 1.46శాతం కంటే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఇదిలాఉంటే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4లక్షల 52వేల క్రియాశీల కేసులున్నాయి.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- 2-1 కాదు 2-0!
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- ఇక చాలు
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- ప్రజాస్వామ్యం గెలిచిన రోజు: బైడెన్
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- సాహో భారత్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
