మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ..66 మందికి కరోనా!
close

తాజా వార్తలు

Published : 28/12/2020 01:18 IST

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ..66 మందికి కరోనా!

భోపాల్‌: దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కాస్త అదుపులోనే ఉన్నప్పటికీ రోజువారీగా దాదాపు 20వేల కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ఇక రేపటినుంచి మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 66మంది అధికారులు, సిబ్బంది, ఎమ్మెల్యేలలో వైరస్‌ బయటపడింది. ఈ విషయాన్ని ప్రొటెం స్పీకర్‌ రామేశ్వర్‌ శర్మ మీడియాకు వెల్లడించారు.

‘ఇప్పటివరకు అసెంబ్లీలో 61 మంది ఉద్యోగులు, అధికారులు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. మరో ఐదుగురు ఎమ్మెల్యేలకు కూడా వైరస్‌ సోకినట్లు తేలింది. 20మంది ఎమ్మెల్యేలు వైద్య పరీక్షల నివేదికలు అందుకున్నాం. వీరితో పాటు ఇంకా చాలా మంది అధికారులు, సిబ్బంది రిపోర్టులు రావాల్సి ఉంది’ అని ప్రొటెం స్పీకర్‌ వెల్లడించారు. అయితే, వీరందరికీ సమావేశాలకు అనుమతి లేదని..వీరు వర్చువల్‌ పద్దతిలో సమావేశాల్లో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.

ఇదిలాఉంటే, మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు 2లక్షల 30వేల కేసులు బయటపడ్డాయి. వీరిలో 3545 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య కోటి దాటగా వీరిలో 97లక్షల మంది కోలుకున్నారు. వీరిలో లక్షా 47 మంది మృత్యువాతపడ్డారు.

ఇవీ చదవండి..
ఆరు నెలల కనిష్ఠానికి కరోనా కేసులు
8 కోట్లు దాటిన కరోనా కేసులు

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని