ఉత్తరభారతంలో పిడుగుల బీభత్సం

తాజా వార్తలు

Updated : 13/07/2021 06:13 IST

ఉత్తరభారతంలో పిడుగుల బీభత్సం

68 మంది బలి.. అత్యధికంగా యూపీలో

దిల్లీ: ఉత్తరభారతంలో మెరుపులతో కూడిన పిడుగులు బీభత్సం సృష్టించాయి. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో పిడుగుపాటుకు 68 మంది మృతి చెందినట్లు ఓ వార్త సంస్థ వెల్లడించింది.

నిన్న ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. యూపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. నిన్న చోటుచేసుకున్న ఘటనలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. అలాగే జీవనాధారమైన పశుసంపదను కోల్పోయిన వారికి ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు. మధ్యప్రదేశ్‌లో కూడా పిడుగులు పడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

ఇక రాజస్థాన్‌లో 20 మంది మరణించారు. పలువురు గాయపడినట్లు సమాచారం. అమెర్ ప్యాలెస్ సమీపంలోని వాచ్‌ టవర్‌ వద్ద కొందరు సెల్ఫీలు తీసుకుంటుండగా పిడుగు పడి పలువురు మరణించారు. టవర్‌పై ఉన్న కొందరు ప్రాణభయంతో కిందికి దూకడంతో గాయాలపాలయ్యారు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ప్రకటించారు. పిడుగుపాటు ఘటనలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని