చండీగఢ్-దిల్లీ సరిహద్దుల వద్ద ఉద్రిక్తత

తాజా వార్తలు

Updated : 26/06/2021 21:37 IST

చండీగఢ్-దిల్లీ సరిహద్దుల వద్ద ఉద్రిక్తత

ఏడు నెలలు పూర్తి చేసుకున్న రైతు ఉద్యమం

దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేపట్టిన ఉద్యమం నేటికి ఏడు నెలలు పూర్తిచేసుకుంది. ఈ క్రమంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన ర్యాలీ చండీగఢ్-దిల్లీ సరిహద్దుల వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. ట్రాక్టర్లు, ఎడ్లబండ్ల మీద పెద్దసంఖ్యలో చండీగఢ్-దిల్లీ సరిహద్దులకు చేరుకున్న రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో సరిహద్దుల వద్ద ఉద్రిక్తత నెలకొంది. అన్నదాతలను నిలువరించేందుకు పోలీసులు జలఫిరంగులు ప్రయోగించారు. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసినప్పటికీ రైతులు ట్రాక్టర్లతో వెళ్లేందుకు ప్రయత్నించారు.

ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా పోలీసులు కొంత మంది రైతు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలు ఏడు నెలలు పూర్తయిన సందర్భంగా సాగు చట్టాలను నిరసిస్తూ అన్ని రాష్ట్రాల గవర్నర్‌లకు అన్నదాతలు వినతిపత్రాలు సమర్పించాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈమేరకు ఆందోళనలు చేపట్టిన రైతులను పోలీసులు ఎక్కడికక్కడ నిలువరిస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని