second wave: 719 మంది వైద్యుల బలి
close

తాజా వార్తలు

Published : 12/06/2021 21:47 IST

second wave: 719 మంది వైద్యుల బలి

దిల్లీ: కరోనా రెండో దశ భారత్‌లో విలయం సృష్టిస్తోంది. సాధారణ పౌరులనే కాదు.. రోగులకు సేవలందించే వైద్యులపై కూడా పంజా విసురుతోంది. కొవిడ్‌ రెండో దశ సమయంలో దేశవ్యాప్తంగా 719 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయినట్లు భారత వైద్య సంఘం (ఐఎంఏ) వెల్లడించింది. అత్యధికంగా బిహార్‌లో 111 మంది వైద్యులు కన్నుమూశారు. దిల్లీలో 109 మంది, ఉత్తర్‌ప్రదేశ్‌లో 79 మంది, పశ్చిమ బెంగాల్‌లో 63 మంది డాక్టర్లు మృతిచెందినట్లు తెలిపింది. ఈ మేరకు ఓ నివేదిక విడుదల చేసిన ఐఎంఏ.. తెలంగాణలో 36 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 35 మంది వైద్యులను కరోనా బలితీసుకున్నట్లు పేర్కొంది.

కొవిడ్‌ కారణంగా వైద్యులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఐఎంఏ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ఎలాంటి భయం లేకుండా విధులు నిర్వహించేలా పని వాతావరణాన్ని కల్పించాలని ఈనెల 7వ తేదీన రాసిన లేఖలో ప్రధాని మోదీని అభ్యర్థించింది. 2020 నుంచి దేశవ్యాప్తంగా 1400 మందికి పైగా వైద్యుల కరోనా కారణంగా ప్రాణాలు కోల్పో యారని ఐఎంఏ మోదీ దృష్టికి తీసుకెళ్లింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని