లాక్‌డౌన్‌ విధించకుంటే లక్ష దాటేవి

తాజా వార్తలు

Published : 25/04/2020 00:42 IST

లాక్‌డౌన్‌ విధించకుంటే లక్ష దాటేవి

దిల్లీ: కరోనా వైరస్‌ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ సత్ఫలితాలను ఇస్తోందని కేంద్రం వెల్లడించింది. కరోనా కేసులు రెట్టింపు అవుతున్న సమయం భారీగా పెరిగిందని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం 10 రోజులకోసారి కేసులు డబుల్‌ అవుతున్నాయని వెల్లడించింది. లాక్‌డౌన్‌ విధించడం వల్లే ఇవాళ కేసుల సంఖ్య 23 వేలు దగ్గర ఉందని, లేకుంటే ఆ సంఖ్య ఈ పాటికే లక్ష దాటేదని నీతి ఆయోగ్‌ సభ్యుడు, ఎంపవర్డ్‌ గ్రూప్‌-1 ఛైర్మన్‌ డాక్టర్‌ వీకే పాల్‌ వెల్లడించారు. శుక్రవారం వివిధ శాఖల సంయుక్త మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

గడిచిన 24 గంటల్లో కొత్తగా 1684 కరోనా పాజిటివ్‌ కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,077కి చేరిందని చెప్పారు. ఇప్పటి వరకు 20.57 శాతం మంది అంటే 4,748 మంది ఈ వైరస్‌ నుంచి కోలుకున్నారని చెప్పారు. గడిచిన 14 రోజుల్లో 80 జిల్లాల్లో కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదని చెప్పారు. 28 రోజులుగా 15 జిల్లాల్లో ఒక్క కేసు కూడా రాలేదని చెప్పారు. కొవిడ్‌-19 పోరాటానికి నిఘా ప్రాథమిక ఆయుధమని నేషనల్‌ సెంటర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుజీత్‌ సింగ్‌ చెప్పారు. ప్రస్తుతం 9.45 లక్షల మంది ప్రస్తుతం నిఘా పరిధిలో ఉన్నారని తెలియజేశారు. 

మరో ఐదు బృందాలు

లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు అమలవుతున్న విధానం, సామాజిక దూరం అమలు, ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన, నిత్యావసరాల సరఫరా, వైద్య సిబ్బందికి భద్రత, సహాయ శిబిరాల్లో పరిస్థితిపై సమీక్షించి కేంద్రానికి నివేదికలు ఇచ్చేందుకు మరో ఐదు అంతర్‌ మంత్రిత్వ శాఖల బృందాలను ఏర్పాటు చేసినట్లు హోంశాఖ సంయుక్త కార్యదర్శి సలిల శ్రీవాస్తవ తెలిపారు. అహ్మదాబాద్, సూరత్, థానే, హైదరాబాద్, చెన్నై నగరాలకు ఈ బృందాలను పంపనున్నట్లు వెల్లడించారు. నాలుగు వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్న ఈ ఐదు నగరాల్లో ఇప్పటికే కేసుల తీవ్రత ఎక్కువగా ఉండడం గమనార్హం. అదనపు కార్యదర్శి స్థాయి అధికారి ఈ బృందానికి నేతృత్వం వహిస్తారు. ఇప్పటికే ఆరు కమిటీలు నియమించగా నివేదికలు పంపిస్తున్నాయి.

ఇవీ చదవండి..

ఆ డ్రగ్‌పై ఆశలు ఆవిరి?

పనిమనిషికి గంభీర్‌ అంత్యక్రియలు

శృంగారం ద్వారా కరోనా వ్యాప్తి చెందదా!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని