12 నుంచి మరో 80 ప్రత్యేక రైళ్లు

తాజా వార్తలు

Updated : 05/09/2020 17:51 IST

12 నుంచి మరో 80 ప్రత్యేక రైళ్లు

దిల్లీ: రైల్వే సేవల పునరుద్ధరణలో భాగంగా మరిన్ని రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే 230 ప్రత్యేక రైళ్లు నడుపుతున్న ఆ శాఖ ఈ నెల 12 నుంచి కొత్తగా మరో 80 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ రైళ్లకు సంబంధించి ఈ నెల 10 నుంచి రిజర్వేషన్లు ప్రారంభం కానున్నాయని రైల్వే బోర్డు ఛైర్మన్‌ వినోద్‌ కుమార్‌ యాదవ్‌ వెల్లడించారు.

అలాగే, ఒకవేళ ఓ రైలుకు ఎక్కువ డిమాండ్‌ ఉన్నా, వెయిటింగ్‌ లిస్ట్‌ ఎక్కువగా ఉన్నా క్లోన్‌ రైలు నడుపుతామని వీకే యాదవ్‌ చెప్పారు. ప్రయాణికులు అందులో ప్రయాణించొచ్చని పేర్కొన్నారు. పరీక్షలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో రాష్ట్రాల కోరినట్లయితే రైళ్లు నడుపుతామని స్పష్టంచేశారు. పూర్తి స్థాయి రైళ్లు ఎప్పుడు ప్రారంభించేదీ వెల్లడించలేదు.

తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్లివే..
రైల్వే శాఖ తాజాగా ప్రకటించిన 80 ప్రత్యేక రైళ్ల జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రారంభమయ్యే/ నడిచే రైళ్లు కొన్ని ఉన్నాయి. వాటిలో సికింద్రాబాద్‌ - దర్బంగా  (07007); దర్బంగా- సికింద్రాబాద్‌ (07008); బెంగళూరు- గువాహటి (02509), గువాహటి- బెంగళూరు (02510);  కోర్బా- విశాఖపట్నం (08517); విశాఖపట్నం- కోర్బా (08518); హైదరాబాద్‌- పార్బణి (07563); పార్బణి- హైదరాబాద్‌ (07564) రైళ్లు ఉన్నాయి.

మొత్తం రైళ్ల జాబితా..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని