కరోనా ఉగ్రరూపం.. టాప్‌ 10 రాష్ట్రాలివే..

తాజా వార్తలు

Published : 27/07/2020 14:12 IST

కరోనా ఉగ్రరూపం.. టాప్‌ 10 రాష్ట్రాలివే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో దాదాపు అర లక్ష కేసులు నమోదవడం ఈ మహమ్మారి వ్యాప్తి తీవ్రతకు అద్దంపడుతోంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 14,35,453 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా.. పాజిటివిటీ రేటు 9.68%గా ఉంది. అయితే, భారత్‌లో ఇప్పటి వరకు 82.71% కేసులు (దాదాపు 11లక్షలకు పైగా కేసులు) కేవలం 10 రాష్ట్రాల్లో, 85శాతానికి పైగా మరణాలు 7 రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హం. 

కేసుల్లో టాప్‌ 10 రాష్ట్రాలివే..
కరోనా ప్రభావం అత్యధికంగా కొనసాగుతున్న రాష్ట్రాల జాబితాలో తెలుగు రాష్ట్రాలూ ఉన్నాయి. నేటి ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన సమాచారం‌ ప్రకారం.. 3,75,799 కేసులతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో తమిళనాడు (2,13,723), దిల్లీ (1,30,606), ఆంధ్రప్రదేశ్‌ (96,298), కర్ణాటక (96,141), ఉత్తర్‌ప్రదేశ్‌ (66,988), పశ్చిమ్‌ బెంగాల్‌ (58,718), గుజరాత్‌ (55,822), తెలంగాణ (54,059), బిహార్‌ (39,176) కొనసాగుతున్నాయి. 

85 శాతం మరణాలు 7 రాష్ట్రాల్లోనే.. 
దేశ వ్యాప్తంగా నమోదైన కొవిడ్‌ మరణాల్లో 85.38శాతం మరణాలు కేవలం ఏడు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 32771 మంది కరోనాతో మరణించగా.. వారిలో 27,979 మంది 7రాష్ట్రాలకు చెందినవారే. మహారాష్ట్రలో అత్యధికంగా 13,656 మంది కరోనాకు బలికాగా.. తమిళనాడులో 3320, దిల్లీ 3827, గుజరాత్‌ 2326, కర్ణాటక 1878, యూపీ 1426, పశ్చిమ బెంగాల్‌ 1372 చొప్పున మరణాలు సంభవించాయి.

24 గంటల్లో అత్యధిక కేసులు, మరణాలు ఎక్కడ? 
దేశ రాజధాని నగరం దిల్లీలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24గంటల్లో అత్యధికంగా కేసులు నమోదైన రాష్ట్రాల్లో దిల్లీ నగరం లేకపోవడం విశేషం. గడిచిన 24 గంటల్లో అ్యధికంగా 9431 కేసులు మహారాష్ట్రలో నమోదు కాగా.. ఆ తర్వాత ఏపీలో 7627 అత్యధిక కేసులు నమోదు కాగా..  తమిళనాడులో 6986, కర్ణాటకలో 5199, యూపీలో 3246 చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరణాల పరంగా చూసినా మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. నిన్న ఒక్క రోజే అక్కడ 267 మంది మృత్యువాతపడగా.. తమిళనాడు 85, కర్ణాటక 82, ఏపీ 54, పశ్చిమ్‌బంగలో 40మంది ప్రాణాలు కోల్పోయారు. 

దేశంలో కరోనా కేసులు నమోదు ఇలా.. 

మరోవైపు, కరోనా దేశంలోకి ప్రవేశించిన 149 రోజుల్లోనే పాజిటివ్‌ కేసుల సంఖ్య 14లక్షలు దాటేసింది. మే 19 నాటికి 1,01139 కేసులు ఉండగా, పాజిటివిటీ రేటు 4.89%గా ఉండేది. అలాగే, జూన్‌ 3 నాటికి 2,07,615 కేసులు నమోదు కాగా.. పాజిటివిటీ రేటు 6.49గా ఉండేది. జూన్‌ 13 నాటికి 3,08,993 కేసులు (పాజిటివిటీ రేటు 7.97%), జూన్‌ 21 నాటికి 4,10,461 కేసులు ( 8.08%); జూన్‌ 27 నాటికి 5,08,953 కేసులు (8.41%); జులై 2 నాటికి 6,04,641 కేసులు (8.34%); జులై 7 నాటికి 7,19,665 కేసులు (9.21%); జులై 11 నాటికి 8,20,916 కేసులు (9.59%); జులై 14 నాటికి 9,06,752 కేసులు (9.95%); జులై 17 నాటికి 10,03,832 కేసులు (10.49%); జులై 20 నాటికి 11,18043 కేసులు (15.79%); జులై 23 నాటికి 12,38,635 కేసులు (13.03%); జులై 25 నాటికి 13,36,861 కేసులు ఉండగా (11.62%); జులై 27నాటికి 14,35,453 కేసులు (9.68%) నమోదయ్యాయి.

కోలుకుంటున్నారిలా..
ఓ వైపు కరోనా వ్యాప్తి ఉద్ధృతమవుతున్నప్పటికీ కొవిడ్‌ బారిన పడి కోలుకుంటున్నవారి సంఖ్యా పెరుగుతోంది. గడిచిన 24గంటల్లోనే 31,991మంది కోలుకోవడం విశేషం. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 9,17,568మంది కోలుకొని డిశ్చార్జి కావడంతో రికవరీ రేటు దాదాపు 64శాతంగా ఉంది. దేశంలో ప్రస్తుతం 4,85,114 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని