మహారాష్ట్రలో ఒక్కరోజే 895మంది మృతి

తాజా వార్తలు

Published : 27/04/2021 23:34 IST

మహారాష్ట్రలో ఒక్కరోజే 895మంది మృతి

ముంబయి: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ మృత్యు ఘోష కొనసాగుతోంది. ఒక్కరోజే అక్కడ 895మంది మృతిచెందారు. రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 66,358 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 2,62,54,737 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 44,10,085 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం 6,72,434 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఔరంగాబాద్‌ జిల్లాలో అత్యధికంగా గత 24 గంటల్లో 162 మంది మృతి చెందారు. అలాగే, నాసిక్‌ జిల్లాలో అత్యధికంగా 11,365 కొత్త కేసులు రాగా.. పుణెలో 9,078, నాగ్‌పూర్‌లో 6,895, ముంబయి 4,014, ఔరంగాబాద్‌లో 1468 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ముంబయి, ఠానే, పుణెలో 2,45,466 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని