2 డోసుల టీకాతో 98% మరణం నుంచి రక్షణ

తాజా వార్తలు

Updated : 03/07/2021 10:15 IST

2 డోసుల టీకాతో 98% మరణం నుంచి రక్షణ

ఈనాడు, దిల్లీ: దేశంలో అందిస్తున్న రెండు వ్యాక్సిన్లు (కొవాగ్జిన్, కొవిషీల్డ్‌) ప్రజలకు రోగ తీవ్రత, మరణం నుంచి మంచి రక్షణ కల్పిస్తున్నట్లు ఓ అధ్యయనంలో తేలిందని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకేపాల్‌ వెల్లడించారు. ఈమేరకు చండీగఢ్‌లోని ‘పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్, రీసెర్చ్‌’ పంజాబ్‌ పోలీసులపై జరిపిన అధ్యయనాన్ని ఆయన ఉటంకించారు. ఈ అధ్యయనం ప్రకారం ఒక్క డోసు తీసుకున్న వారికి 92%, రెండు డోసులు తీసుకున్న వారికి 98% మరణం నుంచి రక్షణ లభించినట్లు వెల్లడించారు. ఆయన శుక్రవారం దిల్లీలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. పంజాబ్‌ పోలీసుల్లో ‘టీకా తీసుకోని వారు, ఒక డోసు తీసుకున్నవారు, రెండు డోసులు వేసుకున్నవారు’ అనే 3 గ్రూపులుగా చేసి ఈ అధ్యయనం జరిపారు. ‘‘పంజాబ్‌ పోలీసుల్లో వ్యాక్సిన్‌ తీసుకోని వారు 4,868 మంది ఉండగా అందులో కొవిడ్‌ బారిన పడి 15 మంది మరణించారు.

అదే ఒక్క డోసు తీసుకున్న 35,856 మందిలో 9 మంది కొవిడ్‌తో చనిపోయారు. 42,720 మంది పోలీసులు రెండు డోసులూ తీసుకోగా.. వారిలో ఇద్దరు మాత్రమే కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ అధ్యయనం ప్రకారం వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల రోగ తీవ్రత, మరణభయం దాదాపు పూర్తిగా తగ్గిపోతున్నట్లు తేలింది. ఇదివరకు సీఎంసీ వెల్లూర్‌లో నిర్వహించిన అధ్యయనంలోనూ ఇదే స్పష్టమైంది. మన వ్యాక్సిన్లు సమర్థవంతంగా పని చేస్తున్నాయనడానికి ఇదే నిదర్శనం’’ అని వీకే పాల్‌ అన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని