ఎయిమ్స్‌ వైద్యునికి కరోనా నిర్ధారణ!
close

తాజా వార్తలు

Published : 02/04/2020 15:49 IST

ఎయిమ్స్‌ వైద్యునికి కరోనా నిర్ధారణ!

దిల్లీ: దేశాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ వైద్యులకూ సోకడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రి వైద్యునికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఎయిమ్స్‌లోని ఫిజియాలజీ విభాగంలో పనిచేస్తున్న వైద్యునికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు అధికారులు. అనంతరం అతన్ని ప్రత్యేక విభాగంలో ఉంచి వైద్యం అందిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు అతని కుటుంబ సభ్యులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించే పనిలో పడ్డారు. 

కరోనా తీవ్రత అధికంగా ఉన్న దిల్లీలో ఆ వ్యాధి బారిన పడిన వైద్యుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గతవారం మొహల్లా క్లినిక్‌లో పనిచేసే వైద్యునికి కరోనా నిర్ధారణ అయ్యింది. అతనితోపాటు వైద్యుని కుటుంబ సభ్యులకు కూడా వైరస్‌ సోకినట్లు అధికారులు గుర్తించారు. దీనితోపాటు రెండురోజుల క్రితం దిల్లీలోని ప్రభుత్వ క్యాన్సర్‌ ఆసుపత్రి వైద్యునికి కరోనా నిర్ధారణ అయినట్లు దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. 

దేశంలో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ కారణంగా దిల్లీలో ఇప్పటివరకు ఇద్దరు మరణించగా బాధితుల సంఖ్య 152కు చేరింది. దేశవ్యాప్తంగా గురువారంనాటికి 1965మందికి కరోనా నిర్ధారణ కాగా వీరిలో 50మంది మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని