ముకేశ్‌ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కలకలం!

తాజా వార్తలు

Updated : 25/02/2021 20:50 IST

ముకేశ్‌ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కలకలం!

కారులో జిలెటిన్‌ స్టిక్స్‌ ఉన్నట్టు హోంమంత్రి వెల్లడి

ముంబయి: ప్రముఖ వ్యాపార దిగ్గజం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. ఆయన ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాలు ఉన్న స్కార్పియో వాహనాన్ని గుర్తించారు. ఈ వాహనాన్ని తొలుత ఆయన భద్రతా సిబ్బంది గుర్తించినట్టు సమాచారం. అనంతరం స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అప్రమత్తమయ్యారు. బాంబు నిర్వీర్య బృందాలు అక్కడికి చేరుకొని తనిఖీ చేశాయి. ఆ వాహనాన్ని అక్కడ ఎవరు పార్క్‌ చేశారు, తదితర వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ కారులో జిలెటిన్‌ స్టిక్స్‌ ఉన్నట్టు పోలీసులు గుర్తించారని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ వెల్లడించారు. దీనిపై ముంబయి క్రైం బ్రాంచ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. దర్యాప్తులో పూర్తి వాస్తవాలు తెలుస్తాయని తెలిపారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని